ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని వైఎస్ జగన్ టార్గెట్ గా పెట్టుకున్న సంగతి విధితమే. మొదట జగన్ ఈ నినాదం అనుడుకున్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతలు హాస్యాస్పదంగా చూశారు. సామాన్యులకు కూడా 175 స్థానాల్లో విజయం సాధించడం అంతా ఈజీనా ? జగన్ పగటి కలలు కంటున్నారా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది రాజకీయ వాదులు జగన్ టార్గెట్ నూ లైట్ తీసుకున్నారు కూడా. కానీ జగన్ మాత్రం వైనాట్ 175 నినాదాన్ని తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నీ స్థానాల్లో విజయం సాధించడానికి జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కట్ చేస్తే సరిగ్గా ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అధినేత చంద్రబాబును జైలుపాలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చేస్తుంటే ఆయన ఎప్పుడు బయటకు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. .
దీంతో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఇక జనసేన విషయానికొస్తే ఆ పార్టీని అసలు ప్రత్యర్థిగా భావించడం లేదని వైసీపీ నేతలే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇదే పరిణామాలు ఎన్నికలవరకు కొనసాగితే జగన్ అనుకున్న లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదనేది కొందరి మాట. ప్రజల్లో టీడీపీని స్కామ్ ల పార్టీగా చిత్రీకరిస్తే.. ప్రజల దృష్టి వైసీపీపైనే ఉంటుంది. దాంతో 175 స్థానాల్లో విజయం సాధించిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట. అయితే ఇటీవల జగన్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్ పార్టీలో అంతర్మథనానికి తెరతీశాయి.
ముఖ్యంగా సీట్ల కేటాయింపులో తన వైఖరి ఎలా ఉండబోతుందో వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి సీట్లు దక్కకపోవచ్చని, స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. తమకు సీటు కేటాయించకపోతే పార్టీ మారే ఆలోచనలో కొంతమంది ఎమ్మెలేలు ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్టీలోని అలకల కారణంగా జగన్ నిర్ధేశించుకున్న వైనాట్ 175 లక్ష్యానికి బ్రేకులు పడే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ సింటిమెంట్ అస్త్రాన్ని వాడుతూ సీటు దక్కనంతా మాత్రాన పార్టీకి సంబంధించినవారు కాకుండా పొరని, సీటు దక్కని వారికి అంతకు మించిన ప్రదాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అందరి అన్నీ వైపులా సర్ధుబాటు చేస్తూ క్లీన్ స్వీప్ విజయాన్ని నమోదు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. మరి లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:ఆసక్తికరంగా నాలుగో పవరాస్త్ర టాస్క్

