ఎన్టీఆర్ తో పులి.. మహేష్ తో సింహం

261
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్‌ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ రాజమౌళి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న క్రేజీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ అదిరిపోయే ఫైట్ ఉందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మహేష్ బాబు తన అనుచరులను కాపాడే క్రమంలో సింహంతో పోరాడాల్సి వస్తోందట. మహేష్ సింహంతో పోరాడే సీన్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందట.

అందుకే.. రాజమౌళి టీమ్ ఈ సీన్ షూట్ చేసేందుకు ఆఫ్రికా వెళ్లనుంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ లో ‘ఎన్టీఆర్ – పులి’ ఫైట్‌ కి మించి.. మహేష్ బాబు – సింహం’ ఫైట్ ఉంటుందట. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. కోమరమ్ భీమ్ లాంటి పాత్రను ఒక స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. ఎన్టీఆర్ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. రాజమౌళి, ఎన్టీఆర్ నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు.

మరి ఈ సారీ మహేష్ నుంచి ఎలాంటి నటనను రాబడతాడో చూడాలి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా మహేష్ – రాజమౌళి సినిమాకి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, మహేష్ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడా ‘తగ్గేదేలే’.. అంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -