‘సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్’ కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా ? అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫైనలైజ్ చేశారు. ‘అమరావతి కి అటు ఇటు…’ అని ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ‘అయోధ్యలో అర్జునుడు’ అనే మరో టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. మరి ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా రానుంది.
పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కాబట్టి, సినిమాలో ఢిల్లీ విధుల్లో జరిగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందట. ఈ ఎపిసోడ్ షూట్ ను ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది.
Also Read: ప్చ్.. ఆ దర్శకుడి పరిస్థితేంటి?
ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. మరి అప్పటి లోపు ఈ సినిమా పూర్తి అవుతుందో చూడాలి.
Also Read: పిక్ టాక్ : అమైరా అందాల విస్ఫోటనం