ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు?

3
- Advertisement -

ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇవ్వమని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, భరోసా అన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ఎంత కష్టమైనా, నష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే కాంగ్రెస్ సంకల్పం అన్నారు.

రేపు తెలంగాణ వ్యాప్తంగా నాలుగు గ్యారెంటీలను ప్రారంభించబోతున్నాం అన్నారు. ఇంత భారీగా పెట్టుబడులు రావడం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం నా రాజకీయ భవిష్యత్తులో తొలిసారిగా చూస్తున్నా అన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలిని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు?.. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీకు కడుపు నొప్పి ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రధానిగా మోడీని గౌరవిస్తాం.. కానీ ఇందిరమ్మ త్యాగం ముందు మోడీ ఎంత? చెప్పాలన్నారు మహేశ్‌ కుమార్ గౌడ్.

Also Read:నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు!

- Advertisement -