మోడీకి మీడియా ఫోబియా అని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. జర్నలిస్టులను ఫేస్ చేసే ధైర్యం మోదీ చేయరు.. రాజకీయాల్లో ఎన్ని గెలిచామన్నది ముఖ్యం కాదు ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం… బీజేపీ కంచుకోట లో బుల్లెట్ దించామా లేదా? చెప్పాలన్నారు.
బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో నాగపూర్ లో కాంగ్రెస్ గెలిచి సత్తా చూపించాం… మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో ఎస్పీ అభ్యర్థులను గెలిపించారా ?లేదా?.. వారణాసి లో బీజేపీ ఓటమి మోదీ కాలానికి చెప్ప పెట్టులాంటింది… కాంతి సింగ్ అవినాష్ కుమార్ పై మంచి మెజార్టీ తో గెలిచారు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీ ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్నాలో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు… పూణే లో ఎన్సీపీ అభ్యర్ధి హర్షత్ దేశ ముఖ్ విజయం సాధించారు… గోరఖ్ పూర్ లో 307 చావు తప్పి కన్నులొట్ట మాదిరి బీజేపీ విజయం అన్నారు.
నాగ్ పూర్, వారణాసి, గోరఖ్ పూర్ పరిస్థితి ఏంటన్నది మోదీ జవాబు చెప్పాలి… నైతికత ఉంటే మోదీ సమాధానం చెప్పాలి… నాగ్ పూర్ గెలిచి మోదీ చాతిమీద కొట్టాం ..* యువత లో మోదీ పాలన పై అసంతృప్తి… వారణాసి లో బీజేపీ అభ్యర్థి ఓటమి బీజేపీ పాలనకు నిదర్శనం … బీజేపీ సిద్ధాంతాలను ప్రజలు చీ కొడుతున్నారు కాబట్టే నాగ్ పూర్ లో ఓటమి… బంకీపుర్ నుంచ వారణాసి వరకు బీజేపీ అభ్యర్థుల ఓటమి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తికి నిదర్శనం… బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లో ఆ పార్టీ నేతల ఓటమి మోదీ పాలనపై వ్యతిరేకతకు నిదర్శనం… రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు గుణపాటం … సర్ పై జరిగిన ఉద్యమం,పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అరాచక పాలనకు నిదర్శనం అన్నారు.
Also Read:నెట్ఫ్లిక్స్ కోసం చిరు ‘మెగావర్స్’
రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం… సర్ తో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం… సర్ పై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు … కుంటిసాకులు చెప్పే వారికీ చెంపపెట్టు… రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి రైళ్ల నిరాకరణ కుట్ర… ప్రధాని మంత్రి, హోంమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి మేరకు రైళ్ల నిరాకరణ… రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుంది… అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి తరలిస్తాం…. సర్ ప్రక్రియ దేశంలో అలజడి సృష్టించింది అన్నారు.

