స్పైడర్ …. యూనివర్సల్ కథ

233
Mahesh is busy with 'Spyder' promotions
- Advertisement -

ప్రిన్స్ మహేష్‌ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  స్పైడర్. తెలుగు,తమిళ భాషల్లో రేపు ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న పలు  ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ ఎగ్జైట్ అవుతారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఓ ఆఫీసర్ పాత్రను ఈ చిత్రంలో నేను పోషించాను. మురుగదాస్ వంటి దర్శకులు మాత్రమే ఇటువంటి సినిమాలను చేయగలరు. తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకే రోజు విడుదలవుతుంది. తమిళంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పానని తెలిపారు.

‘స్పైడర్’లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఇక ఆ చిత్రం షూటింగ్ తరువాత ప్రస్తుతం నటిస్తున్న ‘భరత్ అను నేను’లో చాలా సులభంగా నటించేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

మా నాన్న నటించిన సినిమాలను రీ మేక్ చేసి వాటిల్లో నటించాలని నేనెప్పుడూ అనుకోను. ఎందుకంటే, ఆయనకు నేను పెద్ద అభిమానిని. అసలు, రీమేక్ చేయాలనే ఆలోచనే నాకు రాదు. నేను నటించిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు.. ఈ చిత్రాలన్నీ నా కెరీర్ ను మలిచాయి. ల్యాండ్ మార్క్

ఫిల్మ్స్. ఒక్కడు సినిమా తర్వాతే నేను స్టార్ అయ్యాను.  శ్రీమంతుడు సినిమా నాకు చాలా ముఖ్యమైంది. ఈ చిత్రాలన్నీ నా కెరీర్ ను మలిచాయి. శ్రీమంతుడు సినిమా తర్వాత చాలా మంది గ్రామాలను దత్తత తీసుకోవడం గర్వంగా.. సంతోషంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాల తర్వాత ‘స్పైడర్’ నా కెరీర్ లో మరో ముఖ్యమైన చిత్రం కానుంది’ అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -