‘గుంటూరుకారం’ పై ఫ్యాన్స్ ఫైర్?

21
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ” గుంటూరు కారం ” సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదల అయిన సాంగ్స్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా మూవీలో మహేష్ ఊర మాస్ గా కనిపిస్తుండడంతో తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అయితే మూవీ రిలీజ్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నప్పటికి ఇంకా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు. .

జనవరి 6 న ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ మొదట ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ పై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. కనీసం ట్రైలర్ అయిన రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు గుంటూరుకారం మూవీకి పోటీగా వస్తున్న హనుమాన్ టీం ప్రమోషన్స్ తో తెగ హడావిడి చేస్తోంది. జనవరి 7 న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గుంటూరుకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ 7న కూడా నిర్వహించే అవకాశం లేదు. దాంతో గుంటూరుకారం ప్రీరిలీజ్ ఈవెంట్ 8 లేదా 9 న జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మరి ట్రైలర్ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారా లేదా 7 ననే ట్రైలర్ రిలీజ్ చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నెక్స్ట్ డేట్ చూసుకుంటారా అనేది చూడాలి. మొత్తానికి ప్రమోషన్స్ పరంగా గుంటూరు కారం టీం పై మహేష్ అభిమానులు కొంత అసంతృప్తిగానే ఉన్నారు.

Also Read:షర్మిల ఎఫెక్ట్ : కాంగ్రెస్ లోకి వలసలు?

- Advertisement -