బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నారైల ప్రచారం..

38
- Advertisement -

తెలంగాణలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌తో జరిగిన ఎన్నారైల సమావేశంలో క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిస్తే ఎన్నారైలు వెల్లువలా వివిధ జిల్లాలలో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎన్నారైల మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఒక పక్క ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించే దశలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఎజెండా లేదు. కేవలం కేసీఆర్‌ను తిట్టడమే వారి ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పది పథకాలు గురించి ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్‌లో మాత్రం పది మంది సీఎం సీట్ల కోసం పోట్లాడుతున్నారన్నారు.

తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎన్నారైలంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ ప్రగతి కండ్లముందు కనపడుతున్నది. ఎన్నారైలు అంతా కలిసి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, అశోక్ దూసరి, చందు తల్లా, పూర్ణ బైరి, విన్నీ గౌడ్, విష్ణు జైగుండా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:పిక్ టాక్:గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది

- Advertisement -