ఎన్నారైలు టీఆర్ఎస్‌ వెంటే…ఈటలతో ఒరిగేదేమీ లేదు:మహేశ్‌ బిగాల

48
mahesh

ఎన్నారైలు మొదట్నుంచి కేసీఆర్ ప‌రిపాల‌నా, సంక్షేమం చూశారని…వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ, సమాజహితం ముఖ్యమన్నారు మ‌హేశ్ బిగాల. తొలి నుండి ఎన్నారైలు టీఆర్ఎస్‌కే మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఈటల సమావేశానికి వెళ్లే ఎన్నారైలు…నాడు కోదండరాంకు మద్దతిచ్చి నట్టేట ముంచేశారని మండిపడ్డారు.

విపక్షాలకు చెందిన ఎన్నారై మీటింగుల వల్ల ఒరిగేదేమి లేద‌ని… టీఆర్ఎస్ ఎన్నారైలు ఎవరు ఇందులో పాల్గొనడం లేదని మహేశ్ బిగాల స్ప‌ష్టం చేశారు. ఎన్నారై సభ్యులతో మీటింగ్ పెట్టే ముందు ఈట‌ల పునరాలోచించుకోవాలి. అలాంటి వాళ్లతో స్నేహం ఈటలకు ఎప్పటికైనా ముప్పేనని సూచించారు. తెలంగాణకి నష్టం చేసే ఎవ‌రినైనా క్షమించేది లేదని తేల్చిచెప్పారు.