కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి…

38
up

ఉత్తరప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా మరో ఎమ్మెల్యే కరోనాతో మృతిచెందారు. అధికారా బీజేపీకి చెందిన స‌లోన్ ఎమ్మెల్యే దాల్ బ‌హ‌దూర్ శుక్ర‌వారం ఉద‌యం మ‌ర‌ణించారు. దీంతో యూపీలో క‌రోనాతో చ‌నిపోయిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.బ‌హ‌దూర్ మృతిప‌ట్ల సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబం స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

దాల్ బ‌హ‌దూర్ 2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాయ్‌బ‌రేలీ జిల్లాలోని స‌లోన్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 16 వేల మెజార్టీతో గెలుపొందారు. ఇప్ప‌టికే ఔరైయా ఎమ్మెల్యే ర‌మేశ్ దివాక‌ర్‌, ల‌క్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్స‌వా, న‌వాబ్‌గంజ్ ఎమ్మెల్యే కేస‌ర్ సింగ్ గాంగ్‌వార్ క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందారు.