100 రోజులు పూర్తి చేసుకోనున్న భరత్..

293
Mahesh Bharath ane nenu
- Advertisement -

తన కెరీర్ లో సూపర్ స్టార్ మహేష్‌ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కొరటాల శివ దర్శతకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురపించింది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ నెల 28వ తేదీతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించింది.

Bharat Ane Nenu

మొదటి సారిగా రాజకీయనాయకుడిగా కనిపించి.. అభిమానులను అలరించాడు. ఇక కొరటాల శివ తెరకెక్కించిన విధానం.. కైరా అద్వాని గ్లామర్, దేవి శ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమా విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. సుమారు రూ.200 కోట్లకుగా పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నెల 28న 100వ రోజు సందర్భంగా మహేష్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద సందడి చేయనున్నారు.

ప్రస్తుతం తన 25వ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాకి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దిల్ రాజు – అశ్వినీదత్ – పీవీపీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

- Advertisement -