మీరే సూప‌ర్ స్టార్… హ్యాపీ బ‌ర్త్‎డే నాన్న-మ‌హేష్‎

278
Mahesh-Krishna

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌క‌థానాకుడిగా త‌నదైన ముద్ర వేసుకున్నారు కృష్ణ‌. అటు నిర్మాత‌గాను.. ఇటు ద‌ర్శ‌కుడిగాను సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకుని మంచి విజ‌యాలు అందుకున్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌ను కొత్తద‌నంపై వైపు అడుగులు వేయించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌లో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుని సూప‌ర్ స్టార్‎గా ఎదిగారు.

mahesh-babu-father

నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు త‌నయుడు మ‌హేష్‌. నా బ‌లం, నా గురువు… నా స్ఫూర్తి మీరే. మీ కుమారుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నాను, ఎప్ప‌టికీ మీరే సూప‌ర్ స్టార్ హ్యాపీ బ‌ర్త్ డే నాన్న అంటూ ఎమోష‌నల్ ట్వీట్ చేశారు. మ‌రోవైపు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఆయ‌నకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

 మ‌హేష్ న‌టించిన ప్ర‌తి సినిమాను తండ్రి కృష్ణ చూస్తూ ఉంటారు. ఆ సినిమా ఎలా ఉంది. ఎంత వ‌సూళ్లు సాధించింది అని ప్ర‌తి విష‌యాన్ని తెలుసుకుంటారు. ఏదైనా సినిమా ప‌రాజ‌యం అయిన‌ప్పుడు మ‌హేష్ వెన్నుత‌డుతూ ప్రోత్స‌హిస్తుంటారు.