ఏసీ బ‌స్ స్టాప్ ల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

164
ktr

నూత‌న ప‌థ‌కాల‌తో భాగ్య‌న‌గ‌రాన్ని దేశంలోనే నెం1 సిటీగా తిర్చిదిద్దుతున్నారు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్. స‌రికొత్త ప‌త‌కాల‌తో హైద‌రాబాద్ ను  అభివృద్దిలో వైపు న‌డుపుతున్నారు. ఏండ వేడిమికి ప్రయాణికులు ఇబ్బంది ప‌డ‌కుండా హైద‌రాబాద్ లో రెండు కొత్త ఏసీ బ‌స్ షెల్ట‌ర్ల‌ను ప్రారంభించారు మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి. ఖైర‌తాబాద్ ఆర్టీఏ కార్యాల‌యం స‌మీపంలో ఒక‌టి, కేపీహెచ్ బీ కాల‌నీలో మ‌రోక ఏసీ బ‌స్ షెల్ట‌ర్ ను ప్రారంభించారు.

ac-shelter

జీహెచ్ ఎంసీ, పీపీపీ సంయుక్తంగా ప్ర‌పంచ‌స్ధాయి బ‌స్ షెల్ట‌ర్ల నిర్మాణం చేప‌డ‌తున్నాయ‌న్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్క‌డాలేని విధంగా హైదారాబాద్ లో ఏసీ బ‌స్టాప్ ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. త్వ‌ర‌లో పాత బ‌స్సుల‌ను తీసేసి కొత్త బ‌స్సుల‌ను కూడా న‌డుపుతామ‌న్నారు. ఎల‌క్ట్రీక్ బ‌స్సుల‌ను ప్రేవ‌శ‌పెట్ట‌డానికి ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. రాబోయే ఆరు నెల‌ల్లో బ‌స్ షెల్ట‌ర్ల‌ను పున‌రుద్ద‌రిస్తామ‌న్నారు. త్వ‌ర‌లో 3,800 ఆర్టీసీ బ‌స్సుల‌ను ఆధునీక‌రిస్తామ‌న్నారు.

acbusshelters

త్వ‌ర‌లోనే 500 ఎల‌క్ట్రీక్ బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌వేశ‌పెడుతామ‌న్నారు. హైద‌రాబాద్ ను కాలుష్య ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ‌ ల‌క్ష్య‌మ‌న్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బ‌స్ షెల్ట‌ర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీటీవి సౌక‌ర్యంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా క‌ల్పించ‌నున్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాడానికి త‌మ సిబ్బందికి స‌హ‌క‌రిస్తున్న ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈకార్య‌క్ర‌మంలో మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి, ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే చింత‌ల రాం చంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గోన్నారు.

acbusshelters