మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. అయితే అప్పుడే డిస్ట్రబ్యూటర్లు ఈ సినిమాని సొంతం చేసుకొనేందుకు క్యూ కట్టారు. మహేష్‌కి మురుగదాస్‌లాంటి దర్శకుడు తోడు కావడంతో ఆ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రతి ఏరియాలోనూ మహేష్ ఇదివరకటి చిత్రాలకంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం.
మహేష్ గత చిత్రాలతో పోలిస్తే.. రికార్డు స్థాయిలో శాటిలైట్ హక్కులు 16 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంత పెద్ద మొత్తంలో చెల్లించి మహేష్ సినిమాను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఫిల్మ్ సర్కిళ్లో పెద్ద చర్చనడుస్తోంది. ఇది వరకు ఎనిమీ, అభిమన్యుడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఏజెంట్ శివ పేరు చిత్రబృందం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. క్యాచీగా ఉండడంతో ఇదే టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అటు మహేష్ కూడా ఏజెంట్ శివ టైటిల్ పై సుముఖంగా ఉన్నాడట. ఈ మూవీలో మహేష్ ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ పాత్రకి తగ్గట్టుగానే ఏజెంట్ శివ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా రిలీజయ్యే అవకాశాలున్నాయి.