మేకింగ్ బాహుబలితో యాక్టింగ్ బాహుబలి..

220
Online News Portal
SS Rajamouli spotted bonding big time with Amitabh Bachchan on Sarkar 3 sets
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో సర్కార్ 3 సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఇప్పటికే ఘన విజయాలు సాధించిన వర్మ ఆ వరుసలో తీసున్న మూడో చిత్రమిది. కాగా ఈ సినిమా సెట్స్ లో ఊహించని గెస్ట్ లు దర్శనమిస్తున్నారు.

 unnamed (3)

వారు ఎవరో కాదు బిగ్ బి అమితాబ్, దర్శక ధీరుడు రాజమౌళి. ఈ ఇద్దరు తాజాగా సర్కార్ ౩ సెట్ లో కలవడం జరిగింది. అమితాబ్ కొన్నాళ్ళుగా సర్కార్ ౩ షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. సర్కార్ 3 చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలలో జరుగుతోండగా, అక్కడే బాహుబలి చిత్రీకరణ జరుపుతున్న రాజమౌళి సర్కార్ 3 సెట్ కు వెళ్ళి అమితాబ్ ని కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ‘ ఫిల్మ్ మేకింగ్ లో బాహుబలి యాక్టింగ్ లో బాహుబలి తో కలిసారు” అని ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు వర్మ. కాగా, బాహుబలి ప్రమోషన్ కోసం ముంబాయ్ వెళ్ళిన రాజమౌళి మర్యాద పూర్వకంగానే అమితాబ్ ను కలిసారని తెలిస్తోంది.

ఇటీవల సర్కార్ 3 సెట్ లో బాలకృష్ణ, కృష్ణవంశీలు అమితాబ్ ని కలిసి రైతు చిత్రంలో నటింపజేయాలనే కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై బిగ్ బి కూడా పాజిటివ్ గా స్పందించాడు. అయితే తాజాగా రాజమౌళి, అమితాబ్ ని కలవడంతో జక్కన్న బాహుబలి 2లో అమితాబ్ తో కీలక పాత్ర చేయించనున్నాడా అంటూ చర్చలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

unnamed (2)

కాగా సర్కార్‌ 3 సినిమా ఇటీవల చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. నరేంద్ర హిరావత్ అనే వ్యక్తి ఈ చిత్రం ప్రీక్వెల్, సీక్వెల్, రీమేక్, వరల్డ్ నెగిటివ్ రైట్స్ తనకే ఉన్నాయంటూ చిత్ర దర్శకనిర్మాతలకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులైన అమితాబ్, మనోజ్ బాజ్‌పేయి, జాకీ షరాఫ్, అమిత్ సేథ్, రోనిత్ రాయ్, యామి గౌతమ్, రోహిణి హట్టంగడికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వర్మ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం తనపై ఓ పాట రికార్డింగ్ కూడా జరిగినట్టు అమితాబ్ కూడా తెలిపారు.

- Advertisement -