ఫ్యాన్స్‌కు ‘స్పైడర్’ సర్‌ప్రైజ్…

234
Mahesh Babu's 'Boom Boom' song teaser is out
- Advertisement -

మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పైడర్’ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకే మహేష్ బాబు తన ఫ్యాన్స్‌కు ‘బూమ్ బూమ్’ అంటూ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

తాజాగా ఈ చిత్రంలోని ‘బూమ్‌ బూమ్‌’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. బూమ్ బూమ్ పూర్తి పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు మేకింగ్‌ వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

  Mahesh Babu's 'Boom Boom' song teaser is out

కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ సాంగ్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే 60 వేల వ్యూస్‌ని క్రాస్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ తెగసంబరపడిపోతున్నారు.

హరీష్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్న ఈమూవీ ఒక్కపాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమూవీలో ఎస్.జె సూర్య విలన్‌గా అలరించనున్నారు. ఇదిలా ఉండగా..ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో సందడి చేయనుంది.

- Advertisement -