- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబుకు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అధికారులు షాక్ ఇచ్చారు. మహేష్ బాబు కార్యాలయంపై ఈ రోజు దాడులు నిర్వహించారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మహేష్ వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును చెల్లించాల్సి ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీచేశారు.
అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేష్ బాబు ఖాతాలను అటాచ్ చేస్తూ జీఎస్టీ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు. యాక్సిస్ బ్యాంకులో ఉన్న రూ.43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం మహేష్ బాబుకు నోటీసులు పంపారు.
- Advertisement -