అల్లరి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మహేశ్ బాబు

344
mahesh babu allari naresh
- Advertisement -

టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటివలే అల్లరి నరేష్ కు పెద్దగా సినిమాలు రాకపోవడంతో ఆయన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ఈరోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు. ఈసందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా అల్లరి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

మీ జీవితంలో సంతోషం, స‌క్సెస్ ఎల్ల‌ప్ప‌టికీ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ క‌లిసి మ‌హ‌ర్షి అనే చిత్రంలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో క‌నిపించాడు న‌రేష్‌.కాగా నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నాంది. అల్ల‌రి న‌రేష్ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాంది చిత్ర టీజర్ విడుద‌ల చేశారు. కొన్నేళ్లుగా మీరందరూ నాపై అంతులేని ప్రేమ, విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు, సో.. ఈ పుట్టినరోజుకు నేను అందరినీ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నానంటూ అని నాంది టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నా అని న‌రేష్ పేర్కొన్నాడు.

- Advertisement -