తొలి విడ‌త‌ ఎన్నిక‌ల‌ ఏర్పాట్లు పూర్తిః నాగిరెడ్డి

161
NAGIREDDY

జ‌న‌వ‌రి 21న జ‌రిగే తొలి విడ‌త గ్రామ పంచాయితీ ఎన్నిక‌ల‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని తెలిపారు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి నాగిరెడ్డి. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇవాళ సూర్య‌పేట జిల్లాల్లో ప‌ర్య‌టించారు. పోలీసు అతిథిగృహంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్ పి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రత్యేక ఎన్నికల అధికారి చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా చివ్వెంలలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పిఒలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో నాగిరెడ్డి పాల్గొన్నారు. వేలం ద్వారా పంచాయతీలను ఏకగ్రీవం చేయడం నేరమని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.