అహ్మదాబాద్‌లో మహేష్ ఫైట్‌…

1268
Mahesh Babu to shoot in Ahmedabad
- Advertisement -

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా తెలుగు తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైద్రాబాద్‌, చెన్నైలలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని తాజాగా అహ్మదాబాద్‍లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోఓ భారీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. రకుల్ ప్రీత్-మహేష్‌ల మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

Rakul-Preet-Singh-Photoshoot-For-South-Scope-Photos-03501

వచ్చే నెల 23 వరకు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో, పుణెల్లో కీలక సన్నివేశాలతోపాటు, కొన్ని యాక్షన్‌ ఘట్టాల్ని చిత్రీరిస్తారు. ఆ తరువాత మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి యూకేకు వెళ్లనున్నాడట. గతేడాదిలాగే ఈ సారి కూడా క్రిస్ట్‌మస్‌, న్యూఈయర్‌ను యూకేలోనే జరుపుకోనున్నాడని సమాచారం.

sj-suryah

హైద్రాబాద్‌తో పోల్చితే, అహ్మదాబాద్‌ లాంటి తెలుగు సినిమా పెద్దగా పరిచయం లేని ప్రాంతంలో షూట్ చేస్తే క్రౌడ్ ఇబ్బంది ఉండదని ఈ ప్రాంతంలో షూట్ ప్లాన్ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు అక్కడి మీడియాకు తెలిపారు. అయినా కూడా అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలియడంతో షూట్ ప్రాంతమైన ప్రహ్లాద్‌నగర్ వాసులంతా అక్కడికి వచ్చి మహేష్‌ను కలిసేందుకు ఉత్సాహం చూపారట. ఎన్.వి. ప్రసాద్‌తో కలిసి ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సీజన్ తర్వాత విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్‌గా దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తున్నాడు.

1476516484_superstar-mahesh-babus-much-anticipated-yet-untitled-telugu-project-filmmaker-r-murugadoss-went

మహేష్‌ ఈ చిత్రంలో ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. మహేష్‌ లుక్కుతోపాటు ఆయన నటనని ఓ కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం తెలుగు, తమిళ భాషలకి సరిపడేలా ఓ పేరుని నిర్ణయించి జనవరి 1న ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -