- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ నటీ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదిన విడుదల చేయనున్నారు. అలాగే డిసెంబర్ నెలలో ప్రతి సోమవారం ఒక పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.
ఇటివలే ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఫస్టు సింగిల్ ను విడుదల చేయనున్నారు. మహర్షి చిత్రం తర్వాత మహేశ్ బాబు చేస్తున్న చిత్రం కావడంతో ఈసినిమాపై భారీగా అంచనాలున్నాయి.
- Advertisement -