ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం అయిదుగురు సైనికులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ కల్నల్, మేజర్‌తో పాటు మరో ముగ్గురు జవాన్లు కన్నుమూశారు. దేశ పౌరులని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశ ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హంద్వారా ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు స్పందిస్తూ.. దేశాన్ని కాపాడుతున్న మన సైనికుల సంకల్పం చాలా దృడమైనది. వారు చాలా ధైర్యవంతులు. వారి సంకల్పం మరియు ధైర్యం ఎప్పటికి సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళ్లు అర్పిస్తున్నాను.
హంద్వారా అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారు ధైర్యంగా ఉండాలని వారికి దేవుడు మనో ధైర్యం ప్రసాధించాలని ప్రార్ధిస్తున్నాను. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు.
Heartfelt condolences to all their grieving family and loved ones. Sending them love & strength in this time of grief 🙏🙏🙏 Jai Hind 🇮🇳
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020