మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

374
Mahesh-Babu
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మహేశ్ తర్వాతి సినిమా వంశీ పైడిపల్లితో చేస్తాడని వార్తలు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల ఈమూవీకి బ్రేక్ వచ్చింది. వంశీ పైడిపల్లి స్ధానంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ లైన్ లోకి వచ్చారు. పరశురామ్ వినిపించిన కథ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేశ్ బాబు.

ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.తాజాగా ఈమూవీకి సంబంధించి మరో అప్ డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉగాది రోజున ప్రారంభంకానుందని సమాచారం. మైత్రీ మూవీస్ సంస్ధ ఈచిత్రాన్ని నిర్మించనుంది. కాగా మహేశ్ బాబు చిరంజీవి ఆచార్య మూవీలో ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం.

- Advertisement -