మహేష్‌బాబు సినిమా కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘బ్రహ్మోత్సవం’ సినిమా తర్వాత మహేష్ స్పీడ్ తగ్గిందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాస్త లేటయినా.. మురుగదాస్ తో ఓ సినిమాకి కమిటయ్యాడు మహేష్ . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వియత్నాంలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయలేదు.
చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా, యూనిట్ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
దీంతో అభిమానులను శాంతింపచేయడానికి మహేష్ బాబే రంగంలోకి దిగాడు. మురుగదాస్ మూవీపై తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మహేష్, అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు.
‘ ప్రియమైన నా అభిమానులందరికీ, మీ అందరూ మహేష్ 23 సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మా యూనిట్ రాత్రింబవళ్ళు షూటింగ్ చేస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు మహేష్.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.