అలియా కోరికను సిద్ధార్ద్‌ తీరుస్తాడా..?

113
Alia Bhatt Wants to Get Married Early In Life

అలియాబట్‌కి తల్లి కావాలని ఉందట. పెళ్ళి కాకుండా తల్లేంటి.. అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ అమ్మడుకి పెళ్ళిపై మనసు మళ్ళింది. తల్లికావాలని తెగ తొందరపడుతోంది. అదేం అంటే..పిల్లలు కావాలంటోంది.

వరుస హిట్లతో మంచి డిమాండ్ మీదున్న ఈ అమ్మడు సినిమాల్లోకి చాలా తక్కువ ఏజ్ లోనే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చిన్నతనంలో వచ్చినందుకే ఈ చిన్నది చాలా విషయాలు తెలుసుకున్నానంటోంది.

Alia Bhatt Wants to Get Married Early In Life

మరి అలియా తెలుసుకున్న ఆ విషయాలేంటోగానీ..ఇప్పుడు పెళ్ళి తర్వాత జరిగే విషయాలు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్తోంది. ఆ మాటతో ఈ బ్యూటీ తన గడుసుతనాన్ని మళ్ళీ బయటపెట్టింది. దీంతో ఇప్పుడే అలియా పెళ్ళిచేసుకుంటే ఎలా.. అని అభిమానులు కాస్త ఫీలయ్యారనే చెప్పాలి.

అయితే పెళ్లి తర్వాత నటిస్తారా అంటే…అప్పుడు కూడా నటిస్తానని తేల్చి చెప్పింది. పెళ్ళైనా నటించే హీరోయిన్లు చాలా మందే ఉన్నారని , కరీనా కపూర్ తల్లి అయిన తర్వాత కూడా నటించేందుకు సిద్దం అవుతుంది కదా… అలాంటప్పుడు నేను కూడా నటిస్తే తప్పేంటని జవాబిచ్చింది.
Alia Bhatt Wants to Get Married Early In Life
చూస్తుంటే ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకొని, బిడ్డను కనేయాలని తెగ ఆరాట పడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే అలియా లవర్ గా ప్రచారంలో ఉన్న సిద్దార్థ్ మల్హోత్రా మాత్రం వేరేలా చెప్తున్నాడు. దీంతో ఈ ఇద్దరి మాటలు తేడా కొడుతున్నాయని బాలీవుడ్ లో అనుకుంటున్నారు.

ఇక మల్హోత్రా మాత్రం ఎప్పుడు పిల్లలు కావాలని అనిపిస్తే, అప్పుడే పెళ్ళి చేసుకుంటాని చెప్పిన విషయం తెలిసిందే. ఓ వైపు మల్హోత్రా ఇలా చెప్తుంటే..మరోవైపు అలియా మాత్రం త్వరగా పెళ్లి చేసుకుంటా…పిల్లల్ని కంటా…అంటూ కొత్తగా చెబుతుంది. మరి ఆ విషయంలో ఇంత తొందరపడుతున్న అలియా కోరికను సిద్దార్థ్ తీరుస్తాడా చూడాలి.