మహేష్‌ సినిమా టైటిల్‌ ఇదేనా..!

210
Mahesh Babu new movie title
Mahesh Babu new movie title
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు… మురగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిలే ఖరారు కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్…రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాదాపు 26 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ అమ్ముడు కావటంతో ఇండస్ట్రీ వర్గాలు ఖంగుతింటున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై రకరకాల ప్రచారం జరుగుతున్నాయి. అభిమన్యు.. సంభవామి.. మర్మం.. ఇవన్నీ లేటెస్ట్ గా వినిపించినవి మాత్రమే. అయితే.. ఇవన్నీ కాదని.. ఇప్పటికే వినిపించిన మరో పేరునే ఫిక్స్ చేశారట.

 Mahesh-Babu-on-the-set-of-Agent-Shiva

ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండడం.. తెలుగు తమిళ భాషల్లో ఒకే టైటిల్ ని పెట్టేందుకు యూనిట్ ప్రయత్నిస్తుండడంతో ‘స్పై’డర్.. కే ఫిక్స్ అయ్యాడట మహేష్. ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్టు మహేష్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే రోజున టీజర్ ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా యూకే లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో సిద్ధం చేసిన టీజర్.. అందరినీ ఆకట్టుకోనుందని టాక్‌.

EXCLUSIVE-LEAKED--Mahesh-Agent-Shiva-Movie-Working-Stills3

ప్రస్తుతం స్పైడర్ యూనిట్ చెన్నైలో షూటింగ్ నిర్వహిస్తోంది. మార్చ్ 23వరకూ ఇక్కడ షూట్ చేయనుండగా.. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని వియెత్నాం వెళ్లబోతున్నారు. వియత్నాం షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందట. ఏప్రిల్ చివరి వారానికి మొత్తం షూటింగ్ పూర్తి కానుండగా.. జూన్ 23న తెలుగు.. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh-Babu-Rakul

- Advertisement -