చైతూ కోసం రవితేజను వద్దనుకుంది..!

225
Lavanya not in Ravi Teja's film
- Advertisement -

అందాల రాక్షసితో టాలీవుడ్‌కి పరిచయమైన భామ లావణ్య త్రిపాఠి. తర్వాత సోగ్గాడే చిన్నినాయనా,శ్రీరస్తు శుభమస్తు లాంటి వరుస హిట్‌లను సొంతం చేసుకున్న ఈ భామ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.  పద్దతైన పాత్రల్లోనే నటిస్తూ వచ్చిన లావణ్య… ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ ను ఒలకబోయలేదు. తన వయసున్న హీరోయిన్లంతా మోడ్రన్ గా కనిపిస్తూ తెరపై తళుక్కుమంటుంటే… లావణ్య మాత్రం సంప్రదాయబద్ధంగానే కనిపిస్తోంది. అయితే, ఈ ఇమేజ్ తనకు వద్దంటోంది ఈ భామ. ఈ గుడ్ గర్ల్ ఇమేజ్ తో తనకు విసుగు వచ్చేసిందని… ఒక్క అవకాశం ఇస్తే, గ్లామర్ పాత్రలో మురిపిస్తానని చెబుతోంది.

ప్రస్తుతం వరుణ్‌ సరసన మిస్టర్‌ సినిమాలో నటిస్తున్న లావణ్య … రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది. చాలాగ్యాప్‌ తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ మసాలా ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగాఒక హీరోయిన్‌గా రాశీఖన్నా ఎంపికైంది. అయితే, రెండో సినిమా కోసం లావణ్య త్రిపాఠిని ఎంపికచేశారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి అందాల రాక్షసి తప్పుకుంది.

రవితేజ పక్కన నటించే అవకాశాన్ని లావణ్య వదులుకోవడం ఫిలిం నగర్ లో చర్చనీయాంశం అయింది.రవితేజ కన్నా ముందే నాగ చైతన్య సినిమాను తాను ఒప్పుకున్నానని… దీంతో, రవితేజ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని భావించానని చెప్పింది. సినిమాను ఒప్పుకుని వారిని ఇబ్బంది పెట్టడం కన్నా, ముందే తప్పుకోవడం మేలనే ఆలోచనతోనే… ఆ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపింది. భవిష్యత్తులో రవితేజతో సినిమా చేసే అవకాశం వస్తుందని నమ్మకం ఉందని చెప్పింది.

- Advertisement -