‘అనిరుధ్ ‘గా రానున్న‌ మ‌హేశ్ బాబు..

312
Brahmotsavam
- Advertisement -

సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు ప్ర‌స్తుతం వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమాను చేస్తున్నారు. ఈమూవీలో మ‌హేశ్ స‌ర‌స‌న‌ హీరోయిన్ గా పూజా హెగ్దె న‌టిస్తుంది. తాజాగా డెహ్ర‌డూన్ లో షూటింగ్ పూర్తిచేసుకుంది ఈటీమ్. ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినిద‌త్ లు ఈమూవీని నిర్మిస్తున్నారు. గ‌తంలో మ‌హేశ్ బాబు న‌టించిన బ్ర‌హ్మాత్స‌వం సినిమా భారీ ప్లాప్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల ఈసినిమాను తెర‌కెక్కించాడు.

brahmotsavam

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఈచిత్రంలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న కాజ‌ల్, ప్ర‌ణిత‌లు న‌టించారు. క‌థ చాలా స్లో గా ఉండ‌టంతో ఈసినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. తాజాగా ఈసినిమాను త‌మిళ్ కూడా విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌.

brahmotsavam

త‌మిళంలో మ‌హేశ్ బాబుకు ఈమ‌ధ్య ఎక్కువ క్రేజ్ పెర‌గ‌డంతో అక్క‌డ కూడా బ్ర‌హ్మోత్స‌వం సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. అనిరుథ్ అనే టైటిల్ తో ఆగ‌స్టు 3వ తేదిన భారీ అంచ‌నాల మ‌ధ్య ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు. ఈమూవీకి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కి జే మేయ‌ర్ సంగీతం అందించారు. తెలుగులో భారీ ప్లాప్ ను సొంతం చేసుకున్న బ్ర‌హ్మాత్స‌వం సినిమా త‌మిళ్ లో ఏమేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -