లీకైన ఎన్టీఆర్ అరవింద సమేత పిక్..

254
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయికుడిగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత’ వీర రాఘవ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ దృశ్యం లీకైంది. ఎన్టీఆర్, నాగుబాబు కారులో వెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దృశ్యంలో ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తూ.. పక్కన కూర్చున్న నాగబాబుని దీనంగా గడ్డం పట్టుకుని లేపుతున్నట్లు కనిపిస్తోంది.

NTR

ఇక ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో కత్తి పట్టుకుని ఇప్పిటికే సినిమాపై అంచనాలు పెంచేశాడు ఎన్టీఆర్. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్-నాగబాబు లీకైన దృశ్యం చూస్తుంటే ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథలానే అనిపిస్తుందని చెప్పాలి. ఏమోషనల్ సీన్ కి సంబంధించిన ఈ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎవరు లీక్ చేశారో కానీ.. తెగ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ కి సరసన పూజా హెగ్డే నటిస్తుండగా..తమల్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చిత్ర యూనిట్ తీసుకురావడానికి సిద్దమవుతోంది.

- Advertisement -