చిన్నారి ప్రాణం కాపాడిన సూపర్‌స్టార్‌..

33
Mahesh

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్పటికే చాలా మంది చిన్నారుల చికిత్సకు సాయం చేసి వారి ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. తాజా మ‌హేష్‌ బాబు మరో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు సాయం చేసి రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు. ఈ విష‌యాన్ని మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. దీపావళి పర్వదినాన టపాసులు కాల్చడానికి బదులుగా ఒక మొక్కని నాటితే కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించిన వారిమవుతామని తెలిపింది.

తన భర్త సాయంతో ఆపరేషన్ చేయించుకున్న చిన్నారితో పాటు ఆ చిన్నారి తల్లి ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఆ చిన్నారి ఆపరేషన్ సక్సెస్ అయిందనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఆ చిన్నారిని, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడని చెప్పింది. మహేశ్ బాబు చేస్తోన్న సేవల పట్ల నెటిజన్లు ప్రశంషిస్తున్నారు.