సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు నుంచి ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుదంటే? ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమైన పట్టణాలన్నింటిలోనూ ప్రెస్ మీట్ లు..ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి బోలెడంత హైప్ తీసుకు రావడానికి ప్లాన్ చేయాలి. నిజానికి గుంటూరు కారం రిలీజ్ కి మరో నెల రోజులు కూడా లేదు. అసలు సొంత పరిశ్రమలోనే కాకుండా పక్క పరిశ్రమ ల్లో సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించి సినిమాని ప్రమోట్ చేసుకోకుండా ఎందుకు మహేష్ సైలెంట్ గా ఉన్నాడు ? అంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు.. మేకింగ్ వీడియోలు అంటూ ఎలాంటి హంగామానే కనిపించడం లేదు. గుంటూరు కారం సినిమాని జనాల్లోకి అంతగా తీసుకెళ్లలేకపోతున్నారు. ‘బాహుబలి’ రాజమౌళి విషయంలో ఇంతకు మించి స్ట్రాటజీని అనుసరించి దేశ వ్యాప్తంగా సినిమాని ప్రచారం చేసి వంద శాతం సక్సెస్ అయ్యాడు. మరి త్రివిక్రమ్ మాత్రం ఆ దిశగా ఎందుకు ప్లాన్ చేయడం లేదో !!. అసలు పాన్ ఇండియాలో రిలీజ్ అయిన చాలా సినిమాలు బాగా ఎఫెర్ట్ పెట్టి జనాల్లోకి సినిమాని తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. కానీ ‘గుంటూరు కారం’ విషయంలో ఎలాంటి హైప్ కనిపించడం లేదు.
సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైనా ఇంతవరకూ మహేష్ బాబు ఎక్కడా బయటకు వచ్చినట్లు లేదు. చిత్ర నిర్మాణ సంస్థ వ్యక్తిగతంగా ప్రచారం చేయడం తప్ప ఇంతవరకూ దర్శకుడు త్రివిక్రమ్ గానీ… మహేష్ గాని గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడింది లేదు. ఇప్పటికే సినిమాకి సంబంధించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే వారం నుంచి గుంటూరు కారం టీమ్ వరుస ఇంటర్వ్యూస్ ఇస్తారని టాక్ ఉంది. మరి ఇందులో నిజమెంత ఉందో? త్రివిక్రమో – మహేషో స్పందిస్తే గానీ క్లారిటీ రాదు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
Also Read:చలికాలంలో బెల్లం తింటే ఎన్ని లాభాలో!