హైకోర్టులో శ్రీమంతుడికి ఊరట..

212
Mahesh babu gets relief in HC
- Advertisement -

ప్రిన్స్  మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో ఊరట లభించింది. ‘శ్రీమంతుడు’ సినిమా కాపీరైట్‌ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. వారిద్దరికీ సమన్లు జారీచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.శంకరనారాయణ గురువారం ఉత్తర్వులిచ్చారు.

మహేష్‌బాబు హీరోగా ‘శ్రీమంతుడు’ సినిమా బాక్స్‌ఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.’ఊరిని దత్తత తీసుకోవడం’ ఈ సినిమా సారాంశం. ఊరిని ఉద్ధరించే కథాంశాలు తెలుగు తెరపై చాలా వచ్చిన..వాటికి కంటే కొంచెం డిఫెరంట్‌గా ఈసినిమా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ. దీంతో సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, శ్రీమంతుడు సినిమా కథ తనదేనని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన ‘‘చచ్చేంత ప్రేమ’’అనే నవలను కాపీ చేశారని.. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేశ్ బాబుకు..చిత్ర దర్శకుడు కొరటాల శివ.. నిర్మాత ఏర్నేని నవీన్ లను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120బీ.. కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేశారు.ఈ ఏడాది జనవరి 24న మహేష్‌బాబు, శివలకు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టులో శ్రీమంతుడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

- Advertisement -