సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా శనివారంతో తాజా షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పింది. తర్వాతి షెడ్యూల్ నవంబర్ 24 నుండి అహ్మదాబాద్ లో జరగనుందని యూనిట్ తెలిపింది. వీటి తర్వాత పూణే, చెన్నైలలో కూడా కొన్ని షెడ్యూల్స్ ని జరుపుకోనుంది ఈ చిత్రం.
ఏజేంట్ శివ టైటిల్ తో ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపింనుండగా , ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ బైలింగ్యువల్ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.
కాగా, మహేష్ 24వ సినిమా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మహేష్ కి శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన కొరటాల మరో చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ‘దేవి శ్రీ ప్రసాద్’ సంగీతం అందిస్తున్నారు. 23వ సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉండడంతో ఆయన సతీమణి నమ్రత ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంది. కాగా, జనవరిలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాలని కొరటాల ఇప్పటికే అన్ని ముందు ప్రణాళికలు సిద్ధం చేసారు. ఈ సినిమాకు న్యూ హీరోయిన్ ని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట, కథ రీత్యా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నట్టు సమాచారం.