స్టేజ్‌పై స్టెప్పులేసిన మహేశ్‌..అంతా షాక్‌!

65
mahesh
- Advertisement -

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా విజయోత్సవ వేడుక కర్నూల్‌లో జరుగగా భారీగా జనం హాజరయ్యారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మహేశ్‌.

సర్కారు వారి పాటలో అన్ని పాటలకంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది మ.. మ.. మహేశా పాట. మాస్ సాంగ్.. అందులో మహేశ్, కీర్తి సురేశ్ అదిరిపోయే స్టెప్పులు ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇవ్వగా ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అదే పాటకు డ్యాన్స్‌ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు మహేశ్. నెట్టింట్లో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -