సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో దాదాపు రూ.1,000 కోట్లతో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో హీరో కూడా కలిసి నటించనున్నట్లు దాని అర్థం. అది కూడా టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా రాజమౌళి ఏకంగా ఓ హాలీవుడ్ స్టార్ హీరోనే రంగంలోకి దించబోతున్నట్లు టాక్. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ వార్త ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించారు. ‘నన్ను ప్రభావితం చేసి నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు. ఈ మూవీస్.. నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. అలానే రాజమౌళి సర్‌తో మూవీ ప్రీ ప్రొడక్షన్ మంచిగా సాగుతోంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మహష్ బాబు అన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ సినిమా ఓ సోషియోఫాంటసీ కథతో సాగుతుందట. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి బోలెడు పుకార్లు వినిపించాయి. అందులో ప్రధానంగా మహేష్ బాబు.. ఆఫ్రికాలో అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ మనుషులు, వాతావరణం, చెట్లూ, చేమలూ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయట. ఓరకంగా చెప్పాలంటే.. మరో బాహుబలి లాంటి కథన్నమాట. బాహుబలి లో కూడా అంతే. రాజమౌళి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు మహేష్ తో అలాంటి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి `వీర` అనే టైటిల్ ను దాదాపుగా ఖరారుచేశారని టాక్ నడుస్తోంది.
Also Read:ఆ నటి పై కూడా లైంగిక వేధింపులు