బండ్ల గణేశ్ బ్యాక్ టూ కమెడీయన్..

243
Bandla Ganesh
- Advertisement -

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇటివలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముచ్చటగా మూడు నెలలు కూడా గడువకముందే ఆయన ఈనిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజుల్లోనే హాట్ కామెంట్స్ తో అందరిని నవ్వించాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను బ్లేడ్ తో కొసుకుని చనిపొతానని ప్రకటించాడు.

దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో బండ్ల గణేశ్ పై సెటైర్లు వేశారు. దీంతో ఆయన కొద్ది రోజులు ఎవ్వరికి కనిపించకుండా ఉన్నారు. బండ్ల గణేశ్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేశ్ తిరిగి సినిమాల్లో నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీతో బండ్ల రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.

మహేశ్ బాబు తర్వాతి మూవీ ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఈమూవీలో శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమాయకుడిగా ఈ సినిమాలో బండ్ల గణేశ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈసినిమాలో బండ్ల గణేశ్ పాత్ర పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని సమాచారం. చూడాలి మరి బండ్ల గణేశ్ తిరిగి కమెడీయన్ గా బిజీ అవుతాడో లేదో.

- Advertisement -