మహేష్‌ సినిమాలో కొత్త సీన్స్..?

302
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతూ ఉండటంతో, ఫైనల్ ఎడిటింగ్ సమయంలో తాను తొలగించిన సన్నివేశాలను తిరిగి కలపనున్నట్టు కొరటాల శివ చెప్పారు.

భరత్ అనే నేను’ ప్రోమోలు చూసిన వాళ్లందరికీ ఇంతకుముందు మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమానే గుర్తుకొచ్చింది. ఈ చిత్ర కథాంశం వేరైనప్పటికీ.. ‘శ్రీమంతుడు’ను తలపించే పలు అంశాలు ఇందులో కనిపిస్తాయి. బహుశా దీన్ని సెంటిమెంటుగా కొరటాల-మహేష్ భావించి ఉండొచ్చేమో కూడా. ఆ సెంటిమెంటు ఫలించి ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ విషయంలో అదరగొట్టింది.

Mahesh Babu Bharat Ane Nenu New Scenes Adding

ఇక విశేషం ఏంటంటే.. రిలీజ్ తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ సెంటిమెంటును చిత్ర బృందం ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ‘శ్రీమంతుడు’ ట్రైలర్లో కనిపించి..సినిమాలో లేని కొన్ని సన్నివేశాల్ని సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత కలిపిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమా ‘మిర్చి’ విషయంలోనూ కొరటాల ఇలాగే కొన్ని రోజుల తర్వాత ఒక ఫైట్ జోడించాడు. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ మూవీ విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నాడు కొరటాల. ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని మంచి సీన్స్ ను తొలగించవలసి వచ్చిందని, ఆ సన్నివేశాలను త్వరలో కలపనున్నామని ఆయన అన్నారు. త్వరలో కలపనున్న ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పించడం మొదలైనట్టు సమాచారం.

- Advertisement -