ఆ మార్పు చాలా మేలు చేసింది- సమంత

243
Samantha Akkineni Says About Her Film Career
- Advertisement -

అక్కినేని వారింటి కోడలిగా మారిన తరువాత కూడా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ఇటీవలే ‘రంగస్థలం’తో హిట్ అందుకుని త్వరలోనే ‘మహానటి’లో పలకరించనున్న బ్యూటీ సమంత, నటనను కూడా ఓ ఉద్యోగమే అనుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి తన జీవితమే మారిపోయిందని వ్యాఖ్యానించింది. మారిన తన ఆలోచన తనకెంతో మేలు చేసిందని పేర్కొంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత..‘‘సినిమా ప్రయాణంలో ఎప్పుడేం జరుగుతుందో అంటూ నిత్యం అభద్రతాభావంతో భయపడుతూ గడిపేదాన్ని. ఎప్పుడైతే ఇది కూడా ఓ ఉద్యోగమే అనుకొన్నానో అప్పట్నుంచి నా జీవితమే మారింది. ఆ మార్పు నాకు చాలా రకాలుగా మేలు చేసింద’’ని చెబుతోంది సమంత. ‘రంగస్థలం’తో విజయాన్ని అందుకొన్న ఆమె, ఈ వేసవిలో ‘మహానటి’, ‘అభిమన్యుడు’ చిత్రాలతో సందడి చేయబోతోంది. వ్యక్తిగతంగా వైవాహిక జీవితంతో పాటు, నటిగా కూడా ఈ దశని ఆస్వాదిస్తున్నా అంటోంది సమంత.

Samantha Akkineni Says About Her Film Career

‘‘మంచి కథలు లభించకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా ఒక దశలో. కానీ అదృష్టవశాత్తూ ఆ పరిస్థితి రాలేదు. కొత్త కథల్లో భాగమవుతూ, కొత్త పాత్రల్లో నటిస్తుండడం ఉత్సాహాన్నిస్తోంది. ఒకప్పుడు విజయాల్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి. తర్వాతేంటో అని ఒత్తిడితో సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఆ ఒత్తిడి ప్రభావం లేకుండా పనిచేసే స్థాయికి చేరుకున్నా. చేస్తున్న సినిమాలు, వాటికి లభిస్తున్న ఆదరణ నాలో ధైర్యాన్ని పెంచాయి’’ అన్నారు సమంత.

- Advertisement -