ఆశారాంను దోషిగా తేల్చిన కోర్టు..

259
Asaram Bapu Rape Case Verdict by Jodhpur Court
- Advertisement -

జోధ్‌పూర్‌ కోర్టు ఆశారాం బాపును దోషిగా తేల్చింది. 16 ఏళ్ళ యువతిని రేప్‌ చేసిన కేసులో ఆశారాం ను 2013 ఆగష్టు 31న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ జోధ్‌పూర్ కు చెందిన ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పును వెల్లడించింది.

యూపీకి చెందిన షాజహాన్ పూర్‌ గ్రామస్తురాలైన యువతి చికిత్స కోసం మణి గ్రామంలోని ఆశారాం ఆశ్రమానికి వెళ్ళింది. అయితే తాను దైవానికి మారు రూపమని, తనకు అన్నీ సమర్పించుకోవాలని ఆశారాం తనను మోసం చేశాడని రేప్‌కు గురైన బాధితురాలు ఆరోపించింది. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ, శిల్పిలను కూడా ధోషుగా తేల్చిన కోర్టు, మరో ఇద్దరు శరద్‌, ప్రకాశ్‌లను నిర్ధోషులుగా ప్రకటించింది.

  Asaram Bapu Rape Case Verdict by Jodhpur Court

కాగా కోర్టు ఇచ్చిన తీర్పు సందర్భంగా బాధితురాలు తండ్రి మాట్లాడుతూ.. ఆశారాంను కోర్టు దోషిగా తేల్చిందని, తమకు న్యాయం జరిగిందని తెలిపాడు. ఈ పోరాటంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో ఆశారాంకు శిక్ష ఖారారు అవుతుందని కూడా ఆశిస్తున్నట్లు చెప్పాడు.

మరోవైపు ఆశారాం ఆశ్రమ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. జోధ్‌పూర్‌ కోర్టు తీర్పుపై తమ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించనున్నట్టు తెలిపారు.

- Advertisement -