మ‌హేష్ బాబు థియేట‌ర్లో ‘అంత‌రిక్షం’ ట్రైల‌ర్..

298
amb
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఇటివ‌లే ఏఎంబీ పేరుతో మ‌ల్టీప్లేక్స్ ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. న‌గ‌రంలో ఉన్న ఇత‌ర మ‌ల్టీప్లెక్స్ ల క‌న్నా ఇది చాలా పెద్ద‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఈ మ‌ల్టీప్లేక్స్ లో సినిమాల‌తో పాటు ఈవెంట్లు కూడా నిర్వ‌హించుకునేందుకు వీలుగా దీనిని కట్టారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ మ‌ల్టీప్లేక్స్ ను ఏర్పాటు చేశారు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈసినిమాను షూజీ ఫేం ద‌ర్శ‌కుడు సంకల్ప్ రెడ్డి తెర‌కెక్కించారు.

antarikham

ఇప్ప‌టికే షూటింగ్ ను పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈమూవీ వ‌చ్చే నెల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. అంతరిక్షం సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి, అదితి రావ్ హైద‌రిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

- Advertisement -