మరో సరికొత్త కాన్సెప్ట్‌తో సంకల్ప్‌ రెడ్డి..!

239
sankalp reddy
- Advertisement -

సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఘాజీ. తొలి అండర్‌వాటర్‌ వార్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో హిట్‌ కొట్టడమే కాదు దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు సంకల్ప్‌ రెడ్డి. రెండో ప్రయత్నంగా వరుణ్ తేజ్‌ హీరోగా స్పేస్‌బ్యాక్‌ డ్రాప్‌లో అంతరిక్షం సినిమాను తెరకెక్కించాడు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌కు హిట్‌నిచ్చింది.

ఇక మూడవ సినిమాను కూడా ఇదే తరహాలో తీస్తానంటున్నాడు సంకల్ప్. జానర్ మార్చకుండా టెక్నికల్ సినిమానే తీస్తానంటున్నాడు. ఈ సారి తెలుగులోనే కాదు ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్టుపై అతడు దృష్టి సారించాడట.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అంటార్కిటికా ఖండం నేపథ్యంలో అడ్వెంచరస్ చిత్రంగా ఇది ఉండబోతోందట. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌ మెంట్ రానుందని సమాచారం.

- Advertisement -