మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందంటున్నాయి టీటౌన్ వర్గాలు. ఇదే విషయాన్ని మీడియా వర్గాలు హైలెట్ చేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాడు. అందులో భాగంగా గల్లా అరుణకుమారి నియోజకవర్గంలో కూడా టీడీపీ తరపున ఎన్టీయార్ ప్రచారం చేయాల్సి ఉంది. అయితే మహేష్‌కు గల్లా కుటుంబంతో ఉన్న రిలేషన్ కారణంగా.. ఎన్టీయార్‌కు ఫోన్ చేసి ఆ నియోజకవర్గంలో పర్యటించవద్దని కోరాడట. దీనిపై ఎన్టీయార్ కూడా సరే అన్నాడట. కానీ, ఎన్టీఆర్ ఇచ్చినమాటను నెరవేర్చుకోలేదు. పైగా మహేష్ ఎన్టీఆర్‌తో మాట్లాడిన విషయాలు మీడియాలో వచ్చేశాయి.
దీంతో తను వ్యక్తిగతంగా అడిగిన విషయాన్ని ఎన్టీయార్ మీడియా ముందు పెట్టడం మహేష్‌ను తీవ్రంగా బాధించిందట. అప్పట్నుంచే ఎన్టీయార్‌కు మహేష్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే తరువాత కూడా మహేష్, ఎన్టీయార్ చాలాసార్లు కలుసుకున్నారు. 2011లో జరిగిన ఎన్టీయార్ పెళ్లికి కూడామహేష్ హాజరయ్యాడు. ఆ తరువాత ఇద్దరు కలిసిన సందర్భాలున్నాయి. ఈనేపధ్యంలో టీటౌన్ లో వినిపిస్తున్న వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.