హేమ..లేడి..కిలాడి

221
hema
- Advertisement -

హాస్యనటి శ్రీలక్ష్మీ తరువాత లేడీ కమెడియన్‌గా మళ్లీ అంతటి పేరుతెచ్చుకున్న నటీమణి హేమ అనే చెప్పాలి. వైవిధ్యమైన పాత్రలతో పేక్షకులకు గిలగింతలు పెడుతున్న హేమ… సెటైర్స్ వేయడంలో మహా దిట్టగా పేరుగాంచింది.ఇప్పటివరకూ టాప్ మోస్ట్ కమెడియన్స్ అందరి పక్కనా నటించేసిన హేమ… కొంత కాలంగా కాస్త స్లో అయింది. అయితే మళ్లీ పుంజుకునేందుకు బాగానే ట్రై చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించిన ఈ ముదురు భామ… పూర్తిస్థాయి విలనీగా అలరించబోతోందట.

Hema

కమెడియన్ సప్తగిరి హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో హేమ కూడా ప్రతినాయికగా పరిచయం అవుతోందట. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాలో హేమనే మెయిన్ విలన్ అంటున్నారు. ఈ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందంటూ ఇటీవల వెల్లడించిన హేమ దీంతో తన దశ తిరుగుతుందని ఆశిస్తోంది. మరి ఇన్నాళ్లు పాజిటివ్ రోల్స్ తో అలరించిన హేమ విలన్ గా ఎలా చేసిందో చూడాలి. త్రివిక్రం మార్క్ సెటైర్స్ తో అందరిని ఆటపట్టించే హేమను విలన్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కాని కెరియర్ కాస్త చప్పగా ఉన్న సమయంలో హేమకు ఈ విలన్ గా తీసుకున్న టర్న్ కాస్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -