మహేశ్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇంతవరకూ ఫస్టులుక్ రాలేదు. టైటిల్ కూడా ఖరారు కాకపోవడం అభిమానుల్లో మరింత ఆతృతను పెంచుతోంది. సినిమాకు సంబంధించి ఒక్క వార్త కూడా లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
మహేష్ మూవీపై అఫిషియల్ స్టేట్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తీపికబురు అందించారు దర్శకుడు మురుగదాస్. జనరల్ గా అయితే.. తన సినిమా టీజర్ లాంటిది ఏదో ఒకటి ఇవ్వడం మహేష్ కు ఆనవాయితీ. అట్టర్ ఫ్లాప్ మూవీ బ్రహ్మోత్సవంకు కూడా ఇదే అప్లై చేశారు. కానీ మురుగదాస్ మూవీ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వాస్తవానికి టీజర్ విషయంలో ప్రతీ లాంగ్వేజ్ కు సంబంధించి.. మురుగ దగ్గర సెపరేట్ వెర్షన్ రెడీ చేయడానికి ప్లాన్ ఉంది. అందుకు తగ్గట్లుగానే టీజర్ రెడీ అవుతోంది కూడా.
ఈ సినిమా టైటిల్ ఏమిటో తెలుసుకోవాలనీ .. ఫస్టులుక్ ను చూడాలని ఆత్రుతను ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే టీజర్ ఎప్పుడొస్తుందీ తెలియకపోయినా కూడా.. ఇప్పుడు జూన్ లో డేట్ అంటూ చెప్పేశాడు మురుగు. ”మా గెస్టులుగా మారడానికి సిద్దంగా ఉండండి. జూన్ 23న వచ్చేస్తున్నం. ఎక్సయిటింగ్ గా ఉంది” అంటూ ట్వీటేశాడు.
ఈ ప్రకటన మహేశ్ అభిమానులకి కొంతవరకూ ఆనందాన్ని కలిగించినా, శివరాత్రి సందర్భంగా ఫస్టులుక్ రావచ్చుననుకున్న వాళ్లకి మాత్రం కొంత నిరాశను కలిగించింది. కనీసం ఫస్టులుక్ ఎప్పుడు రిలీజ్ చేయనున్న విషయం కూడా చెప్పకపోవడం వాళ్లకి అసంతృప్తిని మిగిల్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయితేనే ఫస్టులుక్ ను వదలాలని మురుగదాస్ భావిస్తున్నాడట. ఫస్టులుక్ వదిలాక పెద్ద గ్యాప్ లేకుండా టీజర్ .. ట్రైలర్ .. వరుసగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు.