యాంకర్ సుమ అరెస్ట్..!

221
Arrested By SS Rajamouli
- Advertisement -

తెలుగు బుల్లితెర మీద తన మాటలతో, చేతలతో తిరుగులేని యాంకర్ గా గుర్తింపుతెచ్చుకున్నది ఎవరంటే అందరు ఇట్టే చేప్పేస్తారు ఆమె పేరు సుమ అని. సుమ జనమెరిగిన మాటల పుట్ట. మాతృభాష మలయాళమైనా పదహారణాల తెలుగు నేర్చుకుని….యాంకర్లలో స్టార్ మహిళాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ. అలాంటి సుమ అరెస్టైంది. అది రియల్ లైఫ్‌లో కాదు.

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ లో రెండోవ భాగం బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే.

బాహుబలి మేకర్స్ అధికారికంగా బాహుబలి 2 ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న శివరాత్రి సందర్భంగా ప్రభాస్‌ ఫోటోను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌ తీసుకెళ్తున్నాడు. ఇక మొదటిపార్ట్‌లో బాహుబలి సెట్టింగ్‌ మాహిశ్మతి సామ్రాజ్యం అందరిని అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో దేవసేన బందీగా ఉండే ప్రాంతం అందరికి గుర్తుండే ఉంటుంది. రాజమౌళితో ఇంటర్వ్యూ కోసం  యాంకర్‌ సుమ  మాహిష్మతి సామ్రాజ్యం సెట్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా దేవసేన బందీగా ఉన్న గదిలోనే సుమను బందీగా ఉంచిన జక్కన్న ఇంటర్వ్యూ కొనసాగిద్దామని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి కన్‌ క్లూజన్‌ కోసం జక్కన్న ఎంచుకున్న ప్రమోషన్స్‌ సరికొత్తగా వర్కవుటయ్యాయని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు సినిమా జక్కన్న రాజమౌళి. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు జక్కన్న. ఇప్పుడు అదే ఉత్సాహంతో బాహుబలి-2పై భారీ ఆశలు పెట్టుకున్నాడు రాజమౌళి.

- Advertisement -