మహేష్‌-నమ్రతలకు సితార వాలంటైన్స్ డే గిఫ్ట్‌..

118
mahesh
- Advertisement -

పంచవ్యాప్తంగా ఇవాళ వాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు, నమ్రత దంపతులకు వారి కుమార్తె సితార వాలంటైన్స్ డే కానుక అందించింది. చేతితో రాసిన సందేశంతో కూడిన కార్డును ఎనిమిదేళ్ల సితార తన తల్లిదండ్రులకు బహూకరించింది. లవ్యూ అమ్మా, నాన్నా… హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ పేర్కొంది.

దీనిపై మహేష్‌ స్పందించారు. తన ముద్దుల కూతురు సితార అందించిన కార్డును ఆయన ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. “థాంక్యూ సితు పాపా” అంటూ మురిసిపోయారు. “నేను ప్రేమించే ప్రతి ఒక్కరికీ, మీరు ప్రేమించే ఇతరులందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.ఇక మహేష్‌ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

- Advertisement -