100 సార్లు ఆ సినిమా చూశా!

10
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ మాములుదికాదు. ప్రిన్స్‌గా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసిన మహేశ్.. ఓ సినిమాను ఏకంగా 100 సార్లు చూశాడట. ఇంతకీ మహేశ్ చూసిన ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..అదే మోసగాళ్లకు మోసగాడు.

50 ఏళ్ళ కిందట 8 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా 50లక్షల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కృష్ణ తన సొంత బ్యానర్‌ పద్మాలయ స్టూడీయోస్‌పై నిర్మించిన ఈ సినిమా 1971 ఆగస్టు 27లో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఫస్ట్ కౌబాయ్‌ మూవీ ఇదే.

ఇప్పటికీ ఎన్ని సార్లు చూడమన్నా ఏమాత్రం బోర్ ఫీల్ కాకుండా చూస్తానని తెలిపారు మహేశ్‌. ఇప్పటివరకు 100 సార్లు ఈ సినిమా చూశానని తెలిపారు మహేశ్. ఈసినిమా ఇన్‌స్పిరేషన్ తో మహేష్ టక్కరి దొంగ సినిమా చేశారు మహేశ్‌.

Also Read:నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు

- Advertisement -