మహేశ్ 28లో సీనియర్ నటి..!

147
ssmb
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్ వచ్చేస్తోంది. మహేశ్‌- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం…దాదాపు 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రం కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మహేశ్‌ సరసన ఇప్పటికే పూజా హెగ్డె హీరోయిన్‌గా ఎంపిక కాగా మరో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకోనున్నారు.

‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బు, రీసెంట్‌ సినిమా ‘అల వైకుంఠపురములో’లో టబు కనిపించగా తాజాగా శిల్పాశెట్టి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -