అక్షయ తృతీయపై కరోనా ఎఫెక్ట్…!

55
akshaya tritiya 2021

కరోనా సెకండ్ వేవ్ అక్షయ తృతీయపై ఎఫెక్ట్ చూపించింది. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించడంతో బంగారం కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తిచూపించలేదు. సాధారణంగా అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే ఈ రోజు ఎంతోకొంత పసిడిని కొంటే సిరి సంపదలు వస్తాయని నమ్మకం. అందుకే మంచిమంచి ఆఫర్లతో బంగారు దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకునేవి.

కానీ ఈసారి కరోనా కారణంగా అక్షయ తృతీయపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. తెలంగాణ‌లో ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కే షాపుల‌కు అనుమ‌తి ఉండ‌టం, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే షాపులు తెరిచి ఉండ‌టంతో వినియోగ దారులు పెద్ద‌గా కొనుగోలు చేసేందుకు ఫాపుల‌కు రావ‌డంలేద‌ని గోల్డ్ షాపుల య‌జ‌మానులు చెబుతున్నారు.