నేటి గుజరాత్ రాష్ట్రంలో పుట్టి బారిష్టర్ చదువుకొని, చాలా సంపాదించుకునే అవకాశాలుండి.. గొప్ప అడ్వకేట్‌గా పేరున్న మహాత్మా గాంధీ.. ఆయన స్వతంత్ర సమరానికి నాయకత్వం వహించి.. నడుం బిగించారు. దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపి.. నా జాతి కూడా ఇదే పద్ధతిలో పోరాటం చేస్తుందని ఆయన భారత్‌కు రావడం జరిగింది. చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరత మాత. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ.
తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం జరిగే సందర్భంలో… నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడూ అనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా వచ్చారు. పార్లమెంట్ జాయింట్ సెషన్‌లో ప్రారంభించారు. ఉపన్యాసం ప్రారంభించే సమయంలో విలువైన మాట చెప్పారు. ఆ రోజు మన భారతీయులందరి గుండెలు పులకించిపోయాయి. వ్యక్తిగతంగా నేను గర్వపడ్డాను. ‘గాంధీ గారు ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే.. ఒబమా అనే నేను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదు’… ఇది అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట. ఐన్‌స్టిన్ శాస్త్రవేత్త మహాత్మాగాంధీ అనే వ్యక్తి రక్తమాంసాలతో పుట్టి ఈ భూమిమీద నడయాడుతున్నాడని ఎవరు అనుకోలేదు.. అంతటి మహాత్ముడి అని ఐన్‌స్టీన్ చెప్పారు. ఆఫ్రికాలో ఎంతో పోరాటం చేసిన నెల్సన్ మండేలా.. నాకు ప్రముఖమైన స్ఫూర్తి ప్రధాత గాంధీ అని చెప్పారు. గాంధీ విశ్వమానవుడు.. ఆయనను కన్న గడ్డ నా భరత జాతి. అటువంటి జాతికి వారసులం మన అందరం’ అని అన్నారు.